calender_icon.png 4 December, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఐవీపై అవగాహన సదస్సు

13-02-2025 01:54:02 AM

పిట్లం, ఫిబ్రవరి 12 : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో సేవా సంఘం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పిట్లం గ్రామ ప్రజలకు హెచ్‌ఐవి పై అవగాహన కల్పించి, ప్రజలకు ఆరోగ్య అవగాహన మరియు సాధన మార్గాలను బోధించారు.ఆరోగ్య పరిరక్షణలో కీలకమైన హెచ్‌ఐవి బ్లడ్ టెస్టింగ్స్ మరియు బిపి చెకప్స్ నిర్వహించారు.

హెచ్‌ఐవి (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్) మన శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. హెచ్‌ఐవి వ్యాప్తి నుండి మనకంటూ రక్షణకు నియమాలను పాటించడం అవసరం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఆర్ డబ్ల్యు రోజా, పరమేశ్వరి మరియు పిఈ సుగుణ తో పాటు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.