11-05-2025 01:28:54 AM
-8000లకు పైగా ట్రేడ్ విజిటర్ల ఆకర్షణ
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): ఇండియాలో ఇన్‌ఫార్మా మార్కెట్ల ఆధ్వర్యం లో శనివారం 17వ హైదరాబాద్ జ్యువెలరీ పియర్ల్, జెమ్ ఫెయిర్ (హెచ్‌జేఎఫ్ హైటెక్స్ హాల్ ఘనంగా ప్రారంభమైం ది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన బీ టూ బీ ఆభరణాల వాణిజ్య వేదికగా నిలిచింది.
దీపావళి, వివాహ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని వేలా ది మంది ఆభరణ డిజైనర్లు, తయారీదారు లు, రిటైలర్లు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి ఈ ప్రదర్శనకు హాజర య్యారు. 8000లకు పైగా ట్రేడ్ విజిటర్లను ఆకర్షించే ఆశయంతో హెచ్‌జేఎఫ్ భారత ఆభరణ పరిశ్రమ యొక్క ఉత్సాహం, ప్రతిఘటనకు నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రముఖ బ్రాండ్లు, అభివృద్ధి చెందుతున్న ప్రతిభ కలగలిపిన ఈ ప్రదర్శన తాజా ప్రపంచ ధోరణులకు అనుగుణంగా నూతన డిజైన్లు, బ్రాండ్ లాంచ్లను అందిస్తోంది. దీపప్రజ్వలన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జాతీయ మీడియా ప్యానెలిస్ట్ కార్తీక్‌రెడ్డి, జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్ వర్గీస్ అలుక్కా, జీజేసీ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా, హెచ్‌జేఎంఏ అధ్యక్షుడు మహేంద్ర తాయ ల్, వైస్ ప్రెసిడెంట్ ముకేష్ అగర్వాల్, జేఏబీ అధ్యక్షుడు డాక్టర్ చేతన్ కుమార్ మెహతా, ట్విన్ సిటీస్ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్య క్షుడు కైలాష్ చరణ్, తెలంగాణ బులియన్ జెమ్, జ్యువెలరీ ఫెడరేషన్ అధ్యక్షుడు జగదీశ్ పర్షద్ వర్మ, తెలంగాణ పాన్ బ్రోకర్ జ్యువెల ర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరస్మాల్ రాం కా, పొట్ మార్కెట్ జ్యువెలర్స్ అసోసియే షన్ అధ్యక్షుడు అశోక్ షర్మాల్ జైన్, ఏఓజే మేనేజింగ్ డైరెక్టర్ సుమేష్ వాధేరా, ఎస్‌వీ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్రజైన్, ఇన్ఫ ర్మా మార్కెట్ల ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యోగేశ్ ముద్రాస్, ఇన్ఫర్మా మార్కెట్ల ఇండి యా సీనియర్ గ్రూప్ డైరెక్టర్ పల్లవి మెహ్రా , గ్రూప్ డైరెక్టర్ పంకజ్ షెండే పాల్గొన్నారు.
కాగా హెచ్‌జేఎంఏ, తెలంగాణ బులియన్ జెమ్స్, జ్యువెలర్స్ ఫెడరేషన్, తెలంగాణ పాన్ బ్రోకర్స్, జ్యువెలర్స్ అసోసియేషన్, పొట్ మార్కెట్ జ్యువెలర్స్ అసోసియేషన్ లాంటి పరిశ్రమ సంఘాల మద్దతుతో ఈ ప్రదర్శన దక్షిణ భారత ఆభరణాల మార్కెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి కొనుగోలు దారుల అనూహ్య స్పందనతో ఇది ప్రధాన సోర్సింగ్ ప్లాట్ఫామ్గా నిలుస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రదర్శన ఆకర్షణీయంగా మారిన సూచనగా, 3,000 పైగా లక్ష్యబ ద్ధమైన బీ టూ బీ సమావేశాల కోసం రూపొందించిన హోస్టెడ్ బయ్యర్ ప్రోగ్రామ్ ద్వారా వ్యాపార ఒప్పందాలకు బలమైన వేదికగా మారింది. మూడు రోజు ల ప్రదర్శన నెట్‌వర్కింగ్, వ్యాపార లావా దేవీలకు మద్దతు ఇవ్వడమే కాక, భారత ఆభరణాల సమృద్ధ శిల్పకళ, ముందంజలో ఉన్న డిజైన్ భావనలు నూతనంగా సజీవం చేస్తోంది.