11-05-2025 01:19:22 AM
-మాజీ మంత్రులు హరీశ్‌రావు, చామకూర మల్లారెడ్డి
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): భారత సైనికులను చూసి గర్వపడుతున్నామని మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారె డ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీట్ (మల్లారెడ్డి హెల్త్ సిటీ)లో ఆపరేషన్ సింధుర్‌లో పాల్గొన్న సైనికులకు సంఘీభావంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మె ల్యే మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొన్నారు. ముందుగా యుద్ధంలో వీర మరణం పొందిన ఎం మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశ సైనికులను చూసి గర్వపడుతున్నామన్నారు.
సరిహద్దులు అంటే భౌగోళికంగానే కాదు ఈ దేశ ప్రజల భద్రత, దేశ భవిష్యత్తు కూడా అని చెప్పారు. దేశం మీద జరుగుతు న్న దాడికి పరిష్కారం చూపిస్తూ ఉగ్రవాదులపై దాడి చేయడం సరైన చర్యగా పేర్కొ న్నారు. యుద్ధానికి అవసరం పడితే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ కూడా ముందుం టుందన్నారు. సైనికులకు అవసరమైన రక్తా న్ని, వైద్యాన్ని అందించే బాధ్యత దేశ ప్రజలపైనే ఉన్నదని పేర్కొన్నారు.