22-10-2025 01:43:10 AM
-9 నెలల్లో రూ. 1,225 కోట్ల ఆదాయం
-గతేడాదితో పోలిస్తే 245% వృద్ధి
-బిల్డింగ్, లేఔట్ అనుమతుల్లో వేగం
-ఫైల్స్ పరిష్కారంలో కొత్త ఒరవడి
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 21(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దార్శనికతకు అనుగుణంగా హైదరా బాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెల ల్లోనే పర్మిట్ ఫీజుల రూపంలో రూ.1,225 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించి రికార్డు సృ ష్టించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 245% వృద్ధి. అంతేకాకుండా, దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెరగడంతో 88 లక్షల చ.మీ కు పైగా బిల్ట్ అప్ ఏరియాకు అనుమతులు మంజూరయ్యాయి.
నగరం నలుమూల హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ హెచ్‌ఎండీఏ, బహుళ అంతస్తుల నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల మంజూరులో ఈ ఏడాది సాధించిన ప్రగతి గత సంవత్సరాల్లో ఎన్న డూ లేదని మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు.హెచ్‌ఎండీఏ నివేదిక ప్రకారం, 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొమ్మిది నెలలో పర్మిట్ ఫీజుల వసూళ్లు రూ. 1,225 కోట్లు.
ఇది 2024తో పోలిస్తే 245% అధికం. అనుమతుల్లో భారీ పెరుగుదల.. మొత్తం 6,079 దరఖాస్తులు పరిష్కారం. ఇది 2024తో పోలిస్తే 49%, 2023తో పోలిస్తే 36% అధి కం. భవన నిర్మాణాలకు అనుమతి.. 2,904 భవన అనుమతులు పరిష్కరించబడ్డాయి 98% పైగా వీటి ద్వారా 88.15 లక్షల చదరపు మీటర్ల బిల్ట్ అప్ ఏరియాకు ఆమోదం లభించింది. 2024తో పోలిస్తే ఇది 239%, 2023తో పోలిస్తే 87% వృద్ధి.బహుళ అంతస్తుల భవనాలు...77 దరఖాస్తులకు అనుమ తులు మంజూరు. వీటి ద్వారా రూ. 514 కోట్ల ఆదాయం సాధించగా, 78.71 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలకు ఆమోదం లభించింది. ఈ ఏడాది కొత్తగా వచ్చిన 3,677 దరఖాస్తుల్లో 2,887కి అనుమతులు మంజూరు చేసి, 79 శాతం ఆమోద రేటును సాధించింది.
2024లో ఇది కేవలం 38 శాతంగా మాత్రమే ఉండేది. ఫైళ్ల పరిష్కారాన్ని వేగవంతం చేయడంలో హెచ్‌ఎండీఏ పటిష్టమైన యంత్రాం గాన్ని అమలు చేసింది. ప్రతి అధికారిని జవాబుదారీ చేస్తూ, కమిషనర్ స్థాయిలో రోజువారీ సమీక్షలు నిర్వహించడం కీలకమైంది. దరఖాస్తులను పెండింగ్ కాలపరి మితి ఎప్పటికప్పు డు పరిష్కరించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మానిటరింగ్ కారణంగా, 30 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను 2 శాతం లోపు తగ్గించగలిగామని కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు.
నగర రూపురేఖలు మారుస్తున్న భారీ ప్రాజెక్టులు
అనుమతుల్లో వేగం కారణంగా గండిపేట్ మండలం పరిధిలోని కొకాపేట్, బండ్ల గూడ జగీర్ వంటి ప్రాంతాల్లో ఆకాశాన్ని తాకే నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ ఇటీవల అనుమతులు మంజూరు చేసింది. కొకాపేట్...5 సెల్లార్లు + గ్రౌండ్ + 63 అంతస్తుల ఒక బ్లాక్ నిర్మాణం 15.45 లక్షల చ.అడుగులు.. కొకాపేట్..4 సెల్లార్లు + గ్రౌండ్ + 56 అంతస్తుల 5 బ్లాకుల నిర్మాణం 55.44 లక్షల చ.అడుగులు.. బండ్లగూడ జగీర్..2 సెల్లార్లు + 5 పొడియం + 47 అంతస్తుల ఒక బ్లాక్ నిర్మాణం 13.51 లక్షల చ.అడుగులు.
ఈ ప్రాజెక్టులు హైదరాబాద్ నగ రానికి కొత్త ఆకృతి, ఆధునికతను జోడిస్తున్నాయి. ఈ అసాధారణ ఆదాయం నగర ప్రణాళిక, రోడ్లు, ప్రజా సౌకర్యాలు మరియు పచ్చదన ప్రదేశాల అభివృద్ధికి ప్రాణాధారంగా నిలుస్తుంది. హెచ్‌ఎండీఏ సాధించిన ఈ వేగవంతమైన పురోగతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన దార్శనికత, అధికారుల నిబద్ధత కారణమని కమిషనర్ పేర్కొ న్నారు. పారదర్శకత, బాధ్యత, నిబద్ధతతో సంస్థ పనిచేయడం వల్ల పౌరులు, నిర్మాణదారులు, పెట్టుబడిదారులలో విశ్వసనీయ వాతావరణం ఏర్పడిందని ఆయన వివరించారు.