26-07-2025 07:56:12 PM
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పి అండ్ టి కాలనీ రోడ్ నెంబర్ 3 లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిక్ బాక్స్ క్రికెట్ ను పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి(Former Mayor Jakka Venkat Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆటలు మనో వికాసానికి, శరీర ధారుడ్యానికి తోడ్పడుతాయని అన్నారు, నిర్వాహకులు నరేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుబిఎ ప్రధాన కార్యదర్శి ఆకుల సత్యనారాయణ, బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు పైళ్ళ ప్రభాకర్ రెడ్డి, గడీల జగన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ,లగ్గాని సోమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.