26-07-2025 07:44:47 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోమవారపేట్ ను జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు శనివార ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి మొదటగా 9వ తరగతిలో కూర్చొని, ఆంగ్ల ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠాన్ని విన్నారు. టీచింగ్ డైరీ, లెసన్ ప్లాన్, యూనిట్ ప్లాన్ తదితర వాటి గురించి ఉపాధ్యాయుడిని అడిగి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో వివిధ అంగ్ల పదాల స్పెల్లింగ్లను బోర్డుపై వ్రాయించి, వారి ప్రగతిని తెలుసుకున్నారు. ఆంగ్ల ఉపాధ్యాయుడి బోధిస్తున్న తీరును, బోధనా పద్ధతులను, వాడిన టిఎల్ఎంల వివరాలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో నమోదు చేశారు. విద్యార్థుల ప్రగతిని, పాఠశాల సమగ్ర వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు జిల్లా విద్యాశాఖ అధికారికి వివరించారు.