26-07-2025 07:49:33 PM
పాపన్నపేట: సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సంబంధించిన ఏడు సెల్ ఫోన్లు రికవరీ చేసి వారికి అప్పగించినట్లు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్(SI Srinivas Goud) వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వీటిని సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేశామన్నారు. ఇప్పటివరకు తాము 300 కు పైచిలుకు సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు. అయితే ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై సూచించారు. తమ సెల్ఫోన్లను ఎస్ఐ వెంటనే రికవరీ చేయడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.