calender_icon.png 27 July, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ పట్టణంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

26-07-2025 07:52:01 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ దిశానిర్దేశాల మేరకు ఈరోజు నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మి వాడ, డబుల్ బెడ్‌రూమ్స్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. అనుమతులు లేకుండా నడుపుతున్న(70) ద్విచక్రవాహనాలు,(03)ఆటోమొబైల్ వాహనాలు స్వాధీనం చేసుకొని, సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడమైనది. ఈ సందర్భంగా నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ మాట్లాడుతూ... సైబర్ నేరాలు, నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, మద్యం సేవనం, మైనర్ల చేత వాహనాల నడపడం వంటి సామాజిక మలినతలపై విపులంగా వివరణనిచ్చారు.అలాగే ఆస్తి సంబంధ నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం అని స్పష్టంగా తెలియజేశారు.