calender_icon.png 27 July, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి గాయాలు

26-07-2025 07:47:31 PM

కొత్తకోట: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా ముందు వాహనం సడెన్గా బ్రేక్ వేయడంతో వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో బైక్ మీద ఇద్దరిలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయలైన సంఘటన శుక్రవారం రాత్రి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... కొత్తకోట పట్టణ కేంద్రానికి చెందిన గ్లాస్ వర్క్ చేసే సోహెల్(28), అడ్డాకల్ మండలం పెద్దమునగల్ చెడ్ గ్రామానికి చెందిన తయ్యాబ్ (23) ఇద్దరు కలిసి శుక్రవారం సాయంత్రం అన్నసాగర్ గ్రామంలో గ్లాస్ వర్క్ పని మాట్లాడుకోవడానికి మోటర్ సైకిల్ మీద వెళ్లారు.

పని ముగించుకొని తిరుగు ప్రయాణంలో కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ సమీపంలోని నందిక దాబ దగ్గరకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ముందు వాహనం సడన్ బ్రేక్ వెయ్యడంతో బైక్ వాహనాన్ని ఢీకొట్టింది. బైక్ మీద ఉన్న ఇద్దరిలో సోహెల్ అక్కడిక్కడే మృతి చెందగా, తయ్యాబ్ కు బలమైన గాయాలు కావడంతో హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని జిల్లా దవాఖానకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.