26-07-2025 07:59:20 PM
మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్..
హనుమకొండ (విజయక్రాంతి): సంఘటితంగా మన హక్కులను సాధించుకుందామని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. రిజర్వేషన్ డే సందర్భంగా శనివారం తెలంగాణ బీసీ మహాసేన కన్వీనర్ క్రాంతి కుమార్, కో కన్వీనర్ వీరు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట ఛత్రపతి సాహు మహారాజ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బీసీ లకు కాంగ్రెస్ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ హామీనీ సాధించేందుకు అన్ని సంఘాలు కలిసి రావాలని కోరారు.
కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు కలిసికొట్లాడుదామని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ తరహా పోరాటం చేద్దాం. బీసీ ల రిజర్వేషన్ల సాధన కోసం కలిసి వచ్చే సంఘాలను, పార్టీలను కలుపుకొని పోరాడుదాం బీసీల వాదాన్ని వ్యాప్తి చేద్దాం ఈ రోజు అన్ని రంగాల కు చెందిన 42 మంది బీసీ ప్రముఖుల తో రిజర్వేషన్ డే రోజున బీసీ ల 42 శాతం రిజర్వేషన్ కోసం దీక్ష చేయడం బీసీ ఉద్యమంలో ఒక మైలురాయని బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని, దానిఆవశ్యకతను బీసీ సమాజానికి వివరించి ఉద్యమాన్ని ఉదృతం చేద్దాం అని అన్నారు.