calender_icon.png 27 July, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రేషన్ కార్డుల కల నెరవేరింది

26-07-2025 08:06:14 PM

తూప్రాన్,(విజయక్రాంతి): నిరుపేద కుటుంబాలు ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇప్పుడు నెరవేరిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. శనివారం తూప్రాన్, మనోహరాబాద్ మండలాలలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయల్లో రేషన్ కార్డుల పంపిణీలో ఆర్డీవో జయచంద్ర రెడ్డి ఇరుమండలాల ఎంపీడీవో ఎమ్మార్వోలతో కలిసి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కొనసాగించారు. అనంతరం  తెలంగాణ రైతు అగ్రోస్  సేవా కేంద్రమును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 45 వేల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు, కొత్త కుటుంబ సభ్యుల చేరిక ద్వారా లబ్ధి చేకూరిందన్నారు.

ప్రభుత్వం ముందు చూపుతో వర్షాకాలం ని దృష్టిలో పెట్టుకుని మూడు నెలల రేషన్ ఒకేసారి అందించామన్నారు, ప్రభుత్వం అందించిన సన్న బియ్యాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సంతోషంగా వాడు కుంటున్నారని పేర్కొన్నారు. ప్రజా పాలన గ్రామ సభలో ప్రత్యేకంగా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ అర్హత మేరకు అందించడం జరి గిందిన్నారు, మీ సేవలో చేసుకున్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకున్నా మన్నారు, క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా ఎంక్వైరీ నిర్వహించి అర్హత ఉన్నవారికి ఆహార భద్రత కార్డులు జారీ చేయడం జరిగిందన్నారు. కొత్త రేషన్ కార్డులలో పేర్లు చేర్చే ప్రక్రియ జరిగిందన్నారు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు.

అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

అనంతరం కలెక్టర్ పట్టణంలోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంను ఆయన  పరిశీలించారు. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. రికార్డులలో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా లేవా అని పరిశీలించారు, ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులను కలెక్టర్ పలుకరించి, సరిపడా ఎరువులు అందు తున్నాయా అని ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా యూరియా సరిపడా అందుబాటులో ఉంచామని ఎక్కడా కొరత లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లా వ్యాప్తంగా 

ఎరువుల పురుగు మందుల దుకాణాలను రెవెన్యూ, పోలీస్ వ్యవసాయ శాఖ సమన్వయంతో జాయింట్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఫిజికల్ స్టాక్, ఈపాస్ మిషన్ ద్వారా తనిఖీ ప్రైవేట్, ఫ్యాక్స్ డీలర్స్ యూరియా బ్లాక్ మార్కెట్స్ కు తరలి పోకుండా ఎంక్వైరీ చేయడం జరిగిందన్నారు. ఎంక్వయిరీలో జిల్లాలో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగటలేదని నిర్ధారణ అయిందని కలెక్టర్ చెప్పారు. ఇరు మండలాల ఎంపీడీవోలు ఎమ్మార్వోలు, సివిల్ సప్లై అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.