calender_icon.png 27 July, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళన

26-07-2025 08:02:26 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో సుమారు 17 గంటల పాటు ఆందోళన చేపట్టిన సంఘటన రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆసుపత్రి(Singareni Area Hospital)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన లావణ్య అదే పట్టణానికి చెందిన ముద్దసాని సురేష్ అనే సింగరేణి కార్మికునితో గతంలో వివాహం జరిగింది. కొద్ది రోజుల కిందట పెద్దపల్లిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన లావణ్య అపస్మారక స్థితిలో ఉండి మృతి చెందింది. కాగా లావణ్య కుటుంబ సభ్యులు సురేష్ నుంచి రావలసిన కట్నం డబ్భులు, బంగారం తమకు తిరిగి ఇవ్వాలని శుక్రవారం రాత్రి మృతదేహంతో సురేష్ ఇంటికి వెళ్లే క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు పట్టణంలో ఎలాంటి గొడవలు జరుగకుండా ముందస్తుగా ఏరియా ఆసుపత్రి వద్ద లావణ్య కుటుంబ సభ్యులను అడ్డుకున్నారు. మృతదేహంతో ఏరియా ఆసుపత్రి వద్ద తమకు రావాల్సిన కట్నం డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని శనివారం ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.