calender_icon.png 27 July, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక శ్రేయస్సు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన

26-07-2025 08:08:19 PM

మునిపల్లి: మానసిక శ్రేయస్సు అనే అంశంపై చెలిమి కార్యక్రమాన్ని శనివారం నాడు మండల కేంద్రమైన మునిపల్లి ఆదర్శ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గీతం యూనివర్సిటీ(Gitam University)కి చెందిన సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీ ప్రియాంక హాజరై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ... ఒత్తిడి లేకుండా విద్యార్థులు చదివినప్పుడే మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. అలాగే విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆనందంగా మానసికంగా స్థిరంగా ఉన్నప్పుడే విద్యలో ఉన్నత ఫలితాలు సాధిస్తారని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా ఒత్తిడి నియంత్రణకు యోగ తప్పనిసరిగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్, కాలేజ్ ప్రిన్సిపల్ కి మల్లిక, ఉపాధ్యాయులు అనిత, రజనీ తదితరులు పాల్గొన్నారు.