calender_icon.png 29 December, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం, భరోసా కల్పించాలి

29-12-2025 07:51:46 PM

పోలీస్టేషన్ పరిసర ప్రాంతాలను, రిసెప్షన్, రికార్డ్, రూమ్స్ ను  పరిశీలన

నూతన సాంకేతిక వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలి

వనపర్తి రూరల్ పోలీస్టేషన్  తనిఖీ

వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు

వనపర్తి క్రైమ్: పోలీస్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధితులకు పోలీసు అండగా ఉన్నారనే నమ్మకం, భరోసా కల్పిపిస్తూ వారి పట్ల అధికారులు, సిబ్బంది మర్యాద పూర్వాకంగా వ్యవహారించాలని వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి రూరల్ పోలీస్టేషన్ వార్షిక తనిఖీలలో భాగంగా వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు సందర్శించి తనిఖీ చేశారు. అనంతరం పోలీస్టేషన్లో రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేసి పోలీస్టేషన్ రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారేక్, టెక్నికల్ రూం, పరిసరాలను పరిశీలించారు. పోలీస్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, పెండింగ్ లో  ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను వనపర్తి రూరల్ ఎస్సై, జలెందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ... ప్రతి గ్రామంలో వార్డుకు పోలీసు అధికారిని కేటాయించి విపిఓ విధానాన్ని  పక్కాగా అమలు చేస్తూ గ్రామాలకు సంబంధించిన విపిఓలు  రోజు గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని గ్రామాలలో ప్రజలతో స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించాలి. ముఖ్యంగా  ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా గస్తీ నిర్వహించాలన్నారు. పోలీస్టేషన్లో ఉన్న బ్లూ కోర్ట్,  స్టేషన్ రైటర్స్, సెక్షన్ ఇంచార్జ్, పెట్రో కార్, రిసెప్షన్ లాంటి వర్టికల్స్  కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

వనపర్తిరూరల్ పోలీస్టేషన్ పరిధిలో గంజాయి, మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. రాత్రి సమయాలలో మరింత పటిష్టంగా గస్తీ పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరాల అదుపునకు కృషి చేయాలన్నారు. సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్నారు. ముఖ్యంగా కేసుల దర్యాప్తునందు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరైన సమయంలో దర్యాప్తు చేసి కోర్టుల నందు చార్జిషీటు దాఖలు చేసినప్పుడు బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు.

దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది మాట్లాడుతూ పోలీసుశాఖ అందించిన కిట్ ఆర్టికల్స్ ను పరిశీలించి వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే సిబంది నిర్వహిస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకుని ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలనని స్టేషన్ పరిధిలోని వార్డులలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయి అడిగి తెలుసుకొని  వార్డు పోలీస్ అధికారులు వార్డులను పూర్తిగా సమాచారం సేకరించి నేరాలు నిర్ములించాలని తెలిపారు.