calender_icon.png 8 May, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నీటిలో పేరుకుపోతున్న గుర్రపు డెక్క

08-05-2025 12:00:00 AM

  1. ఆక్సిజన్ అందక చెరువులు, వాగుల్లో చేపల మృతి
  2. మత్య్సకారుల ఉపాధికి దెబ్బ..
  3. ఏళ్ల తరబడి పీడిస్తున్న సమస్య
  4. ఫిర్యాదు చేసినా పట్టించుకోని యంత్రాంగం

ఆదిలాబాద్, మే ౭ (విజయక్రాంతి): ఆహ్లాదాన్ని పంచాల్సిన చెరువులన్నీ గుర్రపు డెక్కతో నిండిపోయి ఆహ్లాదానికి దూరంగా ఉన్నాయి. మరోవైపు చెరువుల్లో పేరుకుపోతున్న గుర్రపు డెక్కతో మత్య్సకారుల ఉపాధి ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఈ గుర్రపు డెక్క వాగుల్లోనే కాకుండా క్రమంగా చెరువుల్లోకి కూడా విస్తరిస్తోంది.

స్వంతంగా ఖర్చు పెట్టి గుర్రపు డెక్కను తీయించినా మళ్లీ పెరుగుతుండటం మత్య్సకారుల ఉపాధిని దెబ్బతీ స్తోంది. చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగి చేపల పెంపకానికి అడ్డుగా మారుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మత్య్సకారుల ఉపాధి ప్రశ్నార్థం కానుంది. 

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 247 చెరువులు ఉన్నాయి. వీటిలో 85కుపైగా చెరువు ల్లో గుర్రపు డెక్క పేరుకుపోయి ఉంది. వాగు లు, ఒర్రెలు ద్వారా చెరువుల్లోకి వచ్చిన గుర్ర పు డెక్క మొత్తం చెరువంతా వ్యాపిస్తోంది. ఈ గుర్రపు డెక్క వ్యాప్తి మత్య్సకారుల ఉపాధికి ప్రతిబంధకంగా తయారైంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 4,750 మంది మత్య్సకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

అయితే చెరువుల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో చేపలకు కావాల్సిన ఆక్సిజన్ అందక అవి మృత్యువాతపడుతున్నాయి. చేపల వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న మత్య్సకారులు ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారు. స్వంత ఖర్చులతో చెరువుల్లోని గుర్రపు డెక్కను తొలగిస్తున్నా మళ్ళీ పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు గుర్రపు డెక్కతో నీరు కలుషితమై పశువులకు తాగడానికి వీలులేకుండా పోతోంది. నీటి మీద తేలియాడుతూ కనిపించే జలచరాలను నోట కరుచుకుపో యి కడుపు నింపుకునే కొంగలు, ఇతర పక్షులకు కూడా సంకటంగా మారింది. 

మత్స్యకారుల ఉపాధికి దెబ్బ..

ఆదిలాబాద్ పట్టంలోని ఖానాపూర్  పేరుకుపోయిన చెరువు గుర్రపు డెక్కతో మత్స్యకారులు చేపల వేటకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంవత్సరాలు గడుస్తు న్న గుర్రపు డెక్కను తొలగించడంలో మున్సిపల్ అధికార యంత్రాంగం పట్టించుకోవ డం లేదని.  గత 5, 6 ఏళ్ళ క్రితం నామమాత్రంగా గుర్రపు డెక్కను తొలగించిన అధికా రులు మళ్లీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

జైనథ్‌లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం పక్కనే ఉన్న చెరువు మొత్తం గు ర్రం డెక్కతో నిండిపోయింది. తాంసి మండ లం వడ్డాడి వాగు సమీపంలోని చెరువు కూడా కలుషితమై జలచరాలు మృతి చెందుతున్నాయి. జాలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.  చాందా వాగు పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయింది. 

ఆక్సిజన్ అందక చేపల మృతి..

వాగుల్లో, చెరువుల్లో నీటిపై తేలియాడు తూ అత్యంత బలంగా నీటిలో పాతుకుపోతున్న గుర్రపు డెక్కతో వీటిలో ఉండే చేప లకు ఆక్సిజన్ అందగా మృత్యువాత పడుతున్నాయి. మత్స్యకారుల ఉపాధి కోసం, ఆర్థిక అభివృద్ది కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలను చెరువుల్లో, వాగుల్లో వదులుతున్నారు. కానీ ఈ గుర్రపు డెక్క కారణంగా ఆక్సిజన్ అందక ఎన్నో చేపలు చని పోయిన ఘటనలు సైతం చోటుచేసుకున్నా యి. 

ప్రభుత్వం యంత్రాంగం చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి మత్య్సకారుల ఉపాధికి భరోసా కల్పించాలని స్థానిక మత్య్సకారులు కోరుతున్నారు. ఏదిఏమైనప్పటికి చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగిస్తే మత్య్సకారుల ఉపాధికి భరోసా లభించడమే కాకుండా సం దర్శకులకు ఆహ్లాదాన్ని కూడా పంచుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా అధికారులు చర్యలు చేపడతారని ఆశిద్దాం.

ఎన్నిసార్లు విన్నవించిన..

ఆదిలాబాద్ లోని ఖానాపూ ర్ చెరువులో  పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగించాలని పలు పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. అదేవిధంగా జిల్లాలోని పలు చెరువుల్లో, వాగుల్లో సైతం గుర్రపు డెక్క పేరుకుపోవడంతో తమ గంగపుత్రుల్లో చేపల వేట పై జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర వుతున్నాయి. ప్రభుత్వం తరఫున మత్స్యకారుల ఉపాధి కోసం చెరువుల్లో, వాగుల్లో వేసిన చేప పిల్లలకు గుర్రపు డెక్క కారణంగా ఆక్సిజన్ అందక పలుచోట్ల చేపలు మృత్యువాత పడ్డాయి.  

 మేకల అశోక్, 

గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి