calender_icon.png 8 May, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత సైన్యం ఉగ్రవాదులను అంతమొందించినందుకు సంబరాలు చేసుకున్న యువకులు

07-05-2025 10:39:44 PM

మహాదేవపూర్ (విజయక్రాంతి): పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు అమాయక యాత్రికులను హతమార్చిన దారుణానికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మహాదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గుడాల శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో వీధులలో ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. వీధులలో తిరుగుతూ జాతీయ జెండాలు చేత పట్టుకుని ఆనంద నృత్యాలు చేస్తూ దేశభక్తి పాటలతో ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు కన్నెబోయిన ఐలయ్య, టిఆర్ఎస్ నాయకులు ఆన్కారి అనిల్ ఎమ్మార్పీఎస్ నాయకుడు బెల్లంపల్లి సురేష్, గడ్డం స్వామి, కేసర్ సింగ్, తిరుపతి, రవిచంద్ర,  పోచన్న, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.