07-05-2025 10:42:29 PM
మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని సూరయ్యపల్లిలో తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వంగల శంకర్ గౌడ్ బుధవారం సాయంత్రం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి కిందపడి పోగా అతని కాలు, చెయ్యి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు హుటాహుటిన మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.