15 వేల అడుగల ఎత్తునుంచి ఆసుపత్రి డ్రాప్
న్యూఢిల్లీ, ఆగస్టు 17: భారత సైన్యం, నేవీ చేయని సాహసాలు లేవు. ఆకాశమే హద్దుగా సాహసాలు చేయటంలో మన వీర సైనికులకు సాటి ఎవరూ రారు. తాజాగా భారత నేవీ, సైన్యం కలిసి మరో అద్భుత సాహసం చేశాయి. ఏకంగా 15 వేల అడుగుల ఎత్తునుంచి పోర్టబుల్ దవాఖానను పారాచూట్ల సాయంతో సురక్షితంగా భూమిపైకి దించాయి. యుద్ధాలు, విపత్తుల సమయంలో తీవ్రంగా గాయపడ్డవారికి అత్యవసర చికిత్స అందించేందుకు ప్రాజెక్టు భీష్మ్‌లో భాగంగా ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ దవాఖాన ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్‌ను మన శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనిని ఎక్కడంటే అక్కడ విమానాల ద్వారా జారవిడిచేలా తయారుచేశారు. తాజాగా సీ-130 జే సూపర్ హెర్క్యులస్ విమానంలో దీనిని 15000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి జారవిడిచారు. ఈ పరీక్షలో సైన్యానికి చెందిన పారా బ్రిగేడ్ కీలకంగా వ్యవహరించినట్టు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.




