13 April, 2026 | 5:13 AM

రేపే సూపర్ మూన్

18-08-2024 01:39 AM

ఏడాదిలో వరుసగా నాలుగు

న్యూఢిల్లీ, ఆగస్టు 17: అంతరిక్షం, ఖగోళ అంశాలపై ఆసక్తిచూపేవారికి శుభవార్త. ఈ ఏడాది మొదటి సూపర్‌మూన్ మరికొన్ని గంటల్లో దర్శనం ఇవ్వనున్నది. 2024లో వరసుగా నాలుగు సూపర్‌మూన్లు ఏర్పడనున్నాయి. అందులో మొదటిది సోమవారం రాత్రి 12 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం) ఏర్పడనున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. విశేషం ఏమిటంటే ఇది సూపర్‌మూన్ మాత్రమే కాదు.. బ్లూమూన్ కూడా. సూపర్ మూన్ అంటే భూమికి చంద్రుడు అత్యంత సమీపానికి రావటం. ఆ సమయంలో చంద్రుడు సాధారణంకంటే పెద్దగా, కాంతివంతంగా కనిపిస్తాడు. 1979లో ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ నోల్లీ మొదట ఈ పదాన్ని వాడారు. సోమవారం నాటి సూపర్‌మూన్‌ను ప్రపంచవ్యాప్తంగ చూడొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.