09-01-2026 01:02:12 AM
హైదరాబాద్/గజ్వేల్, జనవరి 8 (విజయక్రాంతి): దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గురువారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మేడారం సమ్మక్క సారల మ్మ జాతరకు రావాలని కోరుతూ ప్రభు త్వం తరఫున ఆహ్వానించారు. కేసీఆర్‌కు శాలువా కప్పి ఆహ్వాన పత్రికను అందజేసి, మేడారం ప్రసాదం అందజేశారు.
తన ఇం టికి వచ్చిన మహిళా మంత్రులకు మాజీ సీ ఎం కేసీఆర్ దంపతులు సాదరంగా ఆహ్వా నం పలికారు. బాగున్నరా అమ్మ అంటూ ఆ త్మీయంగా పలకరించారు. ఆడబిడ్డలను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్, శోభమ్మ దంపతులు.. వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు.
మాజీ సీఎం కేసీఆర్‌కు మేడారం ఆహ్వాన పత్రికను అందజేసిన అనంతరం మంత్రులు సీతక్క, కొండా సురే ఖ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వ యంగా ఆహ్వానం అందజేశామని, ఆ సమయంలో కేసీఆర్‌ను కలుసుకోలేకపోయా మని తెలిపారు. అందుకే కేసీఆర్‌ను స్వ యంగా ఆహ్వానించేందుకు ఎర్రవల్లికి వచ్చామని స్పష్టం చేశారు.
మేడారం మహా జాతరకు రావాల్సిందిగా తల్లుల బంగారా న్ని, బట్టలను కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మలకు బహూకరించి ఆహ్వానించినట్టు వివరించారు. తమ ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించారని, మేడారం జాతరకు వస్తానని కేసీఆర్ చెప్పారని వెల్లడించారు. కేసీఆర్ నివాసానికి వచ్చిన మాకు చీరలు బహుకరించడం సంతోషంగా ఉందన్నారు.
రాజకీ యాలు మాట్లాడుకునే సమయం కాదని, రాష్ట్ర పండుగగా ఎప్పటి నుంచో మనము జాతర నిర్వహించుకుంటున్నామని తెలిపా రు. మంత్రులతోపాటు ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆకాంక్షరెడ్డి ఉన్నారు. అంతకుముందు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సాదర ఆహ్వానం పలికారు.