calender_icon.png 9 January, 2026 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీకి మరణశాసనం

09-01-2026 12:59:53 AM

‘నరేగా’ పరిరక్షణకు దేశవ్యాప్త ఆందోళన: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి) : మహాత్మాగాంధీ జాతీయ ఉపా ధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు గ్రామీణ ఉపాధికి మరణశాసన మేనని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత కార్మికులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన చరిత్రాత్మక ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడు తుందని ఆయన హెచ్చరించారు.

గురువారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ప్రాధాన్యతను నీరు గార్చేందుకు మోదీ సర్కార్ సంస్కరణలు తీసుకొచ్చారని మండిపడ్డారు. సోనియాగాంధీ మానసపుత్రిక గా పేరొందిన  ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే బలహీన పరుస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఈ చట్టంతో గ్రామీణ భారతంలో విప్లవాత్మకమైన  మార్పులు తీసుకొచ్చామన్నారు. పేదలకు ఉపాధి కల్పించడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో గౌరవం ఇనుమడింప చెసిన ఉపాధిహామీ పథకాన్ని తూట్లు పొడిచే విదంగా కేంద్ర ప్రభుత్వం రూట్ మ్యాప్ రూపొందిస్తోందన్నారు. 

ఉపాధిహామీ పథకంలో గాంధీ పేరు ఉండడంతోటే మోదీ సర్కార్ కుట్ర పూరితంగా పథకాన్ని బలహీనపరుస్తోందని ఆ యన మండిపడ్డారు. ఉపాధిహామీ పథకం కింద జాబ్‌కార్డుదారులకు 100 రోజుల గ్యా రెంటీ ఉపాధి, వేతనం వంటి నిబంధనలను మోదీ ప్రభుత్వం రద్దు పరచడం శోచనీయమన్నారు. ఈ పధకంలో గ్రామ పంచాయతీ లకు ఉన్న పరిపాలనా అధికారాలను తొలగించడం దుర్మార్గమన్నారు. 

ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చిన ఈ పధకంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కోత విధించడం సరికాదన్నారు. ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ పేరు తో ఆ 40 శాతం నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపి గ్రామీణ కార్మికుల జీవనప్రమా ణలపై నేరుగా దాడి చెయడమేనని ఆయన విమర్శించారు. ఉపాధిహామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యంత్రాం గం పోరాటాలకు సన్నద్ధం కావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  పిలుపునిచ్చారు.

ఉపాధిహామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించడం నిధుల కోత, ఉద్యోగ హక్కులను బలహీన పరచడాన్ని గట్టిగా ప్రతిఘ టించాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు ఉ ద్బోధించారు. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 12,000 గ్రామ పంచాయతీలు సంస్కరణలను వ్యతిరేకిస్తూ  ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, ఆ తీర్మానాలను రాష్ట్రపతికి కూడా ఇవ్వాలన్నారు. చట్టంలోని మౌలిక సూత్రాలను పునరుద్ధరణ కు దీర్ఘకాలిక ఆందోళన అవసరమని, అందుకు  కాంగ్రెస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.