calender_icon.png 28 November, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదం ఎలా జరిగింది?

28-11-2025 12:18:13 AM

  1. విచారణ చేపట్టిన హాంకాంగ్ పోలీసులు
  2. భవన మరమ్మతుల సామగ్రే కారణమని అనుమానం
  3. 83కు చేరిన మృతుల సంఖ్య..76 మందికి తీవ్ర గాయాలు

హాంకాంగ్, నవంబర్ 27: హాంకాంగ్ వాంగ్ హాక్ కోర్ట్ టవర్స్‌లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 83కు చేరుకుంది. ఈ విపత్తులో 76 మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 237 మంది గల్లంతయ్యారు. ఈ తీవ్ర అగ్ని ప్రమాదంపై ఆ దేశపు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడానికి ఆ భవన మరమ్మతులో ఉపయోగిస్తున్న సామగ్రి కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

భవంతుల కిటికీల వద్ద మరమ్మతుల కోసం ఉంచిన పాలిస్టరైన్ బోర్డుల వల్లే మంటల తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది.  భవన నిర్మాణం ప్రతి కిటికీల్లో స్టురైఫామ్‌తో తయారు చేయబడిన వస్తువులను ఉపయోగించారని.. దాని కారణంగానే మంటలు ఇంత పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో చెలరేగాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కచ్చితమైన కారణమేంటో ఇంకా తెలియరాలేదు.

కాగా స్టురైఫామ్ అనేది పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్.. దీనిని నిర్మాణరంగంలో, ఫుడ్ ప్యాకేజింగ్‌లలో ఎక్కువుగా ఉపయోగిస్తారు. అయితే స్టురైఫామ్‌కు మండే స్వభా వం అధికంగా ఉంటుంది. దీనికి మం టలు అంటుకుంటే అంత తేలికగా ఆర్పలే ము. ఉష్ణోగ్రత తక్కువ ఉన్న ప్రదేశాలలో కూడా ఇది అధికంగా మండుతోంది.  ఇది మండుతున్నప్పుడు అధిక మోతాదులో కార్బన్ డై యాక్సైడ్ విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో భవన మరమ్మతులో ఇంత హానీకర వస్తువులను ఎందుకు ఉపయోగించారు అని పోలీసులు విచారణ చేపడతున్నారు.