calender_icon.png 11 December, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల సిబ్బందికి ఎన్ని ఇబ్బందులో?

11-12-2025 12:13:51 AM

ఎన్నికల నిర్వహణకు గిరిజన గ్రామాలకు థర్మాకోల్ తెప్పపై పయనం

పెంబి మండలంలో ఘటన 

నిర్మల్, డిసెంబర్ 10( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు వెళ్తున్న సిబ్బందికి బుధవారం కష్టాలు తప్పలేదు. పెంబి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వెళ్తున్న సిబ్బందికి వాగులు వడ్డం రావడంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరమకోల్ తిప్పల సాయంతో ఎన్నికల సామగ్రితో తరలిం చారు.

పెంబి మండలంలోని పసుపుల వ్యాపారులు కూడా తదితర గిరిజన గ్రామాలకు వెళ్లే సిబ్బంది వాగు లు దాటి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎన్టీఆర్ బృందల పోలీసుల సహకారంతో ధర్మకోల్ తిప్పలపై వాగులు దాటించారు కొందరు సిబ్బందికి అగ్నిమాపక విపత్తు నిర్వహణ సిబ్బంది ధరించే జాకెట్లను వేసి రక్షణగా ఎన్నికల సామగ్రి సిబ్బందిని పోలింగ్ తరలించారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు అయేషా ముసరఫ్ ఖాన్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షించారు.