12-08-2024 12:00:00 AM
డ్రైప్రూట్స్ హెల్త్ కు చాలా మంచివి. అందులో వాల్ నట్స్ గుండె ఆరోగ్యానికి బలమైన పోషకాలను అందిస్తాయి. అయితే వాల్ నట్స్ లో పోషకాలు ఉంటాయనే కారణంతో చాలామంది తెలియక ఎక్కువగా తినేస్తుంటారు. అది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. రోజుకు 30 నుండి 60 గ్రాముల వాల్ నట్స్ తినాలని డాక్టర్లు చెబుతున్నారు. వాల్ నట్స్ క్రమం తప్పకుండా తినేవారికి గుండెపోటు తక్కువగా ఉంటుంది. గుండె జబ్బులతో మరణించే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. వారంలో నాలుగు రోజులు వాల్ నట్స్ తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 30% నుండి 50% వరకు తగ్గించవచ్చు. అంతేకాదు.. వాల్ నట్స్ మెంటల్ హెల్త్‌ను బలంగా ఉండేలా చేస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని దూరం చేస్తుంది. ఇది మిమ్మల్ని కేలరీలతో ఓవర్ లోడ్ చేస్తుంది. అలర్జీ, దద్దుర్లు, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
వంద గ్రాముల వాల్ నట్స్ లో 654 క్యాలరీలు ఉంటాయి. ప్రతిరోజూ వాల్నట్లను తినడం వల్ల మీ శక్తి స్థాయిలను కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు రోజూ నానబెట్టిన వల్ల తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. అలాగే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. బరువు నియంత్రణకు, రక్తహీనత నివారణకు ఇవి చాలా బాగా పనిచేస్తాయి.