calender_icon.png 5 July, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాన్‌సూన్ స్పెషల్ స్పైసీ సమోసా

12-08-2024 12:00:00 AM

చల్లని వాతావరణంలో చాలామందికి వేడి వేడి ఫుడ్ ఐటమ్స్ ను లాగించేయాలనిపిస్తుంటుంది. మాన్ సూన్ సీజన్‌లో ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడుతారు. ఎప్పుడు బజ్జీలు, పకోడీలు తినే బదులు స్పైసీగా, నోరూరించే సమోసా ట్రై చేస్తు చాలా బాగుంటుంది. దీనిని సాధారణ రోజుల్లో కూడా తింటారు కానీ.. మాన్’సూన్’లో వేడివేడిగా తింటే దాని ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది.

ఇక సమోసాలను రకరకాల పద్ధుతుల్లోనూ తయారుచేసుకుంటారు. కొందరు మాంసాహారంతో తయారైన సమోసాలను ఇష్టపడితే.. మరికొందరు మాత్రం వెజిటెబుల్స్’లోని కొన్ని పదార్థాలతో తయారైన వాటిని మాత్రమే తినడానికి ఇష్టపడతారు. అందులో ముఖ్యంగా ఆలూ, ఉల్లిపాయ కాంబినేషన్’తో తయారయ్యే సమోసాతో ఎంతో రుచికరంగా వుంటుంది. పైగా బంగాళదుంప(ఆలూ)లో కార్బోహైడ్రేట్’లు అధికంగా వుండటంతో అది అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. దీని రెసిపీ ఎంటో తెలుసుకోండి

కావాల్సిన పదార్ధాలు

250 గ్రాములు మైదా

2 కప్స్ బంగాళదుంపలు (ఉడికించి ముక్కలుగా కట్ చేయాలి)

4-5 పచ్చిమిర్చి (సన్నగా తరగాలి)

1/2 టీ స్పూన్ జీలకర్ర

1 టీ స్పూన్ గరంమసాలా

1 టీ స్పూన్ ఛాట్ మసాలా

1 టీ స్పూన్ మ్యాంగో పౌడర్

1 టీ స్పూన్ అజ్వైన్

1/4 టీ స్పూన్ పసుపు

కొద్దిగా పచ్చిబఠానీలు

కొద్దిగా వేరుశెనగపప్పులు

కొద్దిగా జీలకర్రపొడి

కొద్దిగా నెయ్యి (సమోసాను రెడీ చేయడానికి)

కొద్దిగా నూనె (డీప్ ఫ్రై కోసం)

2-4 కప్పులు గోరువెచ్చని నీరు (పిండి కలుపుకోవడం కోసం)

రుచికి తగినంత ఉప్పు

తయారు చేసే విధానం

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కొద్దిగా గోరువెచ్చని నీరు, నెయ్యి, ఉప్పు, మైదాపిండి తదితర పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. సాఫ్ట్’గా కలుపుకున్న అనంతరం ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడయ్యాక అందులో జీలకర్రవేసి కొద్దిసేపు వేగించాలి. అనంతరం మ్యాంగో పొడి, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి తదితరలు వేసి ఫ్రై చేసుకోవాలి.

బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో బంగాళదుంపల ముక్కలు, పచ్చిబఠానీలు, కొన్ని పిచ్చిమిర్చి ముక్కలు, వేరుశెనగపప్పు, తగిన పరిమాణంలో (రుచికి సరిపడేంత) ఉప్పు తదితర పదార్థాలు వేసి మిక్స్ చేయాలి. 2 నిముషాల తర్వాత అందులో గరంమసాలా, ఛాట్ మసాలా వేసి 5 నిముషాలవరకు వేగించుకోవాలి. అనంతరం స్టౌవ్ ఆఫ్ చేసి ఆ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి.

ఇప్పుడు ముందుగా కలుపుకున్న మైదాపిండి మిశ్రమాన్ని తీసుకుని.. అందులో నుంచి కొద్దిగా పిండిని పూరీల్లా వత్తి, అందులో కొద్దిగా బంగాళదుంప మిశ్రమాన్ని స్టఫ్ (కూరడం) చేయాలి. తర్వాత దానిని త్రికోణాకృతిలో ఫోల్ చేసుకుని, దాని అంచులను గట్టిగా ఒత్తుకోవాలి. ఈ విధంగా కావలసినన్న (మొత్తం పిండి అయ్యేంతవరకు) తయారుచేసుకొని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఒక పాన్’ను తీసుకుని అందులో తగిన పరిమాణంలో నూనె వేసుకుని వేడి చేయాలి. వేడైన తర్వాత అందులో ఇదివరకు తయారుచేసి పెట్టుకున్న సమోసాలను వేసి బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన అనంతరం వాటిని ఒక టిష్యు పేపర్ మీద వేసి, అదనపు ఆయిల్’ను పీల్చుకునేలా చేయాలి. అంతే నిమిషాల్లో వేడి వేడి సమోసాలు రెడీ