calender_icon.png 2 January, 2026 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూడియ తండా అంగన్వాడి సెంటర్ నందు హెచ్ఎస్ఎన్డీ ప్రోగ్రాం

02-01-2026 08:33:51 PM

చిన్నపిల్లలకు అంగన్వాడీ సెంటర్ తల్లి లాంటిది

స్టేజి తండా సర్పంచ్ జాటోత్ అమ్మిభీమా

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్టేజి తండా గ్రామపంచాయతీ కూడిన తండా నందు అంగన్వాడి కేంద్రంలో హెచ్ఎస్ఎన్డీ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ ఎల్లమ్మ హాజరయ్యారు. అనంతరం స్టేజి తండా సర్పంచ్ బీమా మాట్లాడుతూ... చిన్నపిల్లలకు అంగన్వాడి సెంటర్ తల్లి లాంటివి అని అన్నారు. అనేపురం గ్రామ పోస్టల్ శాఖ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాటో ప్రియాంక అంగన్వాడి పిల్లలకు ఆటవస్తులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్, సిడిపిఓ ఎల్లమ్మ, సూపర్వైజర్ ఉషారాణి, ఏసీ డిపిఓ తేజశ్రీ, తల్లులు  దేవి, మంజుల, నవ్య, తదితరులు పాల్గొన్నారు.