calender_icon.png 27 January, 2026 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీలో భారీగా చేరికలు

27-01-2026 02:05:18 AM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో చేరిన పలువురు

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో సోమవారం పలువురు పెద్ద సంఖ్యలో టీఆర్పీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి అనుబంధ గ్రామం బద్దు తండా నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికలు జరిగాయి.తుర్కపల్లి మండల టీఆర్పీ ఇన్‌చార్జి కొమ్రిశెట్టి నర్సింహులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల కీలక నేతలు తమ పదవులకు రాజీనామా చేసి టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. బద్దు తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, తమ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, తీన్మార్ మల్లన్న సిద్ధాంతాలకు ఆకర్షితులై తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.

పార్టీ అధినేత మల్లన్నచేరిన వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేసేవారికే భవిష్యత్తు ఉంటుందని, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం టీఆర్పీ అలుపెరగని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ నాయకులతో  పాటు బద్దు తండాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్పీలో చేరిన వారందరూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.