27-01-2026 02:03:45 AM
హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షుడు విక్రమ్ కుమార్
హైదరాబాద్, జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించు కుని హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓ యూనియన్ కార్యాలయ ఆవరణలో సోమవారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షులు ఎస్ విక్ర మ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రా జ్యాంగం మనకు కల్పించిన హక్కులను కాపాడుకుంటూనే, బాధ్యతాయుతమైన ఉద్యోగులుగా మనం ప్రజలకు సేవ చేయాలన్నారు. టీఎన్జీఓ యూనియన్ ఎప్పుడూ ఉద్యోగుల సం క్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కో సం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.
మన ఐక్యతే మన బలం, రాబోయే రోజుల్లో యూ నియన్ కార్యకలాపాలను మరింత ఉధృతం చేస్తాం అని పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర క్లాస్-౪ ఉద్యోగుల సంఘం అధ్య క్షులు దాశ్యా నాయక్, ప్రధాన కార్యదర్శి ఖాదర్ బిన్ హసన్, అసోసియేట్ ప్రెసిడెంట్ కేఆర్ రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బి. శంకర్, పబ్లిసిటీ సెక్రటరీ వైదిక్ శ్రేష్ట గారు పాల్గొన్నారు. వారితో పాటు వివిధ యూ నిట్ల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య సభ్యు లు సుధాకర్ రెడ్డి, చాంద్ పాషా, నయీమ్, రోజేష్, ఇలియాస్,ఇతర ఉద్యోగ ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.