calender_icon.png 27 January, 2026 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరికొత్త రైజింగ్

27-01-2026 01:48:42 AM

అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ

భిన్నత్వంలో ఏకత్వమే మన ప్రత్యేకత

రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 

77వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సీఎస్, డీజీపీ

హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి) : రైజింగ్ తెలంగాణ-- 2047లో భాగంగా ప్రజాప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించిందని, భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత అని చెప్పారు.

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ బలగాలు, ఎన్సీసీ కేడెట్లు నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్.. వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరవీరుల స్మారకం వద్ద ప్రముఖులు నివాళు లర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ర్టం సాధిస్తున్న అద్భుత ప్రగతిని కొనియాడారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేత త్వంలోని ప్రజాప్రభుత్వం ‘తెలంగాణ రైజిం గ్ విజన్ - 2047’ ద్వారా రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తోందని అన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యంలో భాగంగా తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే మహత్తర లక్ష్యాన్ని పెట్టుకుందని పేర్కొ న్నారు.

రాష్ట్ర అభివద్ధిని మూడు ప్రధాన మండలాలుగా (ప్యూర్, క్యూర్, రేర్) విభజించి, సమతుల్య పాలనను అందిస్తున్నార ని కొనియాడారు. ప్రతి ఏటా డిసెంబర్ 9న తలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మేడారం అభివృద్ధి కోసం రూ.251 కోట్లు కేటాయించామన్నారు. గతేడాది  నిర్వహించిన బతుక మ్మ వేడుకలకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కిందని గవర్నర్ గుర్తు చేశారు.

మహిళా సాధికారత, యువతకు ఉపాధి..

మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం ద్వా రా రూ.40 వేల కోట్ల బ్యాంకు అనుసంధా నం కల్పించడం గొప్ప విషయమని గవర్నర్ అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పేర్కొ న్నారు.  మహిళలకు పెట్రోల్ బంక్‌లు, ఆర్టీసీ అద్దె బస్సులకు ఓనర్లుగా చేశామన్నారు.

ఆర్టీసీ బసుల్లో ఇప్పటికే 200 కోట్ల మం ది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని గవర్నర్ వెల్లడించారు. గ్రూప్   ద్వా రా ఉద్యోగాల భర్తీ చేశామని తెలిపారు. ప్ర భుత్వం ఇప్పటీ వరకు 62,749 ఉద్యోగ ని యామకాలు పూర్తి చేసి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ఉపా ధి కల్పిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు. హైదరాబాలో కాలుష్య నియంత్ర ణకు చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ చెప్పారు.

ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, మెట్రో రెండో దశ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ రూపురేఖలను మారుస్తాయని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో ‘ఇండియా జస్టిస్ రిపో ర్ట్-2025’లో తెలంగాణ పోలీస్ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం రాష్ట్ర ప్రతిష్టను పెంచిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హ క్కులతో పాటు బాధ్యతలను కూడా నిబద్ధతతో నిర్వర్తించడమే మనం రాజ్యాంగ నిర్మా తలకు ఇచ్చే అసలైన నివాళి అన్నారు. 

వరిధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానం

వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని గవర్నర్ అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. రూ.2 లక్షల రుణమాఫీ పథకం వల్ల ఇప్పటి వరకు రూ.20,617 కోట్లతో సుమారు 26 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణ విముక్తి కల్పించిందని అన్నారు. సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చొప్పున రూ.1,780 కోట్లు అందజేసినట్లు చెప్పారు.

ఐటీఐలను అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్లుగా మార్చి తెలంగాణను గ్లోబలన్ స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. విద్యార్థులను సమాన అవకాశాలు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. ధరణి సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు అనుకూలమైన భూభారతి చట్టాన్ని తీసుకురావడం వంటివి విప్లవాత్మక మార్పులని ఆయన పేర్కొన్నారు.