calender_icon.png 27 January, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా జాతరకు సర్వం సన్నద్ధం

27-01-2026 01:41:24 AM

  1. నేటి నుంచి మేడారంలో గద్దెలపైకి నో ఎంట్రీ

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

పోలీసుల రోప్ పార్టీ మాక్ డ్రిల్ నిర్వహణ

మేడారం, జనవరి 26 (విజయక్రాంతి): తెలంగాణ ఆదివాసీ గిరిజన సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తూ, ప్రపం చ ఖ్యాతి గడించి, దక్షిణాది కుంభమేళగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం ప్రారం భం కానుంది. వనదేవతల దర్శన భాగ్యానికి కోట్లాదిమంది భక్తులు మేడారం అడ వుల వైపు అడుగులు వేయడానికి సన్నద్ధమవుతున్నారు. అడవులు, కొండలు, వాగులు అన్నీ భక్తి నాదంతో మార్మోగే క్షణాలకు సమయం దగ్గరపడింది.

జాత ర రద్దీ నేపథ్యంలో భక్తులకు నేటి నుంచి గద్దెల పైకి నో ఎంట్రీ ఉంటుందని, భక్తు లు సహకించాలని, వీవైపీలు, వీవీఐపీలు సంయమనం పాటించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సోమవారం కోరారు. జాతరను విజయవంతం చేయడానికి పోలీసుల రోప్ పార్టీ మాక్ డ్రిల్ నిర్వహించారు. వివిధ విభాగాల యంత్రాంగం మహా జాతరకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సమక్క తల్లి గురువారం చిలకల గట్టు నుంచి మే డా రం గద్దెల ప్రాంగణాన్ని అధిష్టించనున్నారు.

ఆమె కుమార్తె సారలమ్మ కన్నేపల్లి నుంచి, గోవిందరాజు కొండాయి నుంచి, పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి తరలివచ్చి బుధ వారం గద్దెల ప్రాంగణాన్ని అధిష్టిస్తారు. మ హాజాతర క్షణం కోసం దేశం నలుమూలల నుంచి కోట్లాదిమంది భక్తులు మేడారం తరలివస్తున్నారు. అమ్మల రాక కోసం ఎదురు చూస్తున్నారు. మిగతా భక్తులు మేడారం బా ట పట్టారు. వనదేవతల మహా జాతరకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యం లో మేడారం సమగ్ర అభివృద్ధి కోసం 251 కోట్ల ఖర్చు చేశారు.

భక్తులకు వైద్యం, తాగునీరు, విద్యు త్, రవాణా సౌకర్యాల కోసం యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జంపన్న వాగులో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మేడారంలో నిరంతరం వైద్య సేవలు అం దించడానికి ప్రత్యేకంగా 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 4,000 బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాం తాల నుంచి మేడా రం జాతరకు ప్రత్యేకంగా నడుపుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మం త్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క నేతృత్వంలో మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనుల చేశారు. ఈసారి జాతరకు ముందే సుమారు అరకోటికిపైగా భక్తులు మేడారం వచ్చినట్లు అధికారులు అంచనావేస్తున్నారు.

ఎంట్రీ లేదు.. భక్తులు సహకరించాలి..

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జా తర బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి గద్దెలపైకి భక్తులను నేరుగా అనుమతించడం జరగదని, భక్తులు సహకరించాలం టూ రాష్ట్ర పం చాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ ద్వారా భక్తులు గద్దెల గ్రిల్ బయట నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వీఐపీ, వీవీఐపీ, ఇతర ప్రముఖులు దర్శనానికి సం యమనం పాటించాలని మంత్రి కోరారు.

బందోబస్తు ఏర్పాట్ల ట్రయల్..

మహాజాతరను ఎలాంటి అవాంతరాలూ లేకుండా విజయవంతం చేడానికి పోలీసులు రోప్ పార్టీ మాక్ డ్రిల్‌ను సోమవారం నిర్వహించారు. ప్రత్యేకమైన ట్రైబల్ బెటాలియ న్, ఫిఫ్త్ బెటాలియన్, రిజర్వుడు పోలీసులతో పటిష్టమైన భద్రతతో కూడిన రోప్ పార్టీ మాక్ డ్రిల్ నిర్వహించారు. వన దేవతలను జన, వన ప్రవేశం చేయించే పూజారు లకు, భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన పటిష్టమైన బందోబస్తు నిర్వహణకు చర్యలు చేపట్టారు.