04-01-2026 01:00:55 AM
14 మంది మవోయిస్టులు మృతి
రాయ్‌పూర్/చర్ల, జనవరి ౩: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర పోరు జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పులతో ఆ ప్రాంతం యుద్ధభూమిని తలపించింది. సుక్మా, బీజా పూర్ జిల్లాల్లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతిచెందా రు. సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందగా, మృతుల్లో పార్టీ అగ్రనేత కొంటా ఏరియా కమిటీ డివిజనల్ సభ్యుడు సచిన్ మంగ్డూ ఉన్నా డు.
గతేడాది ఏఎస్పీ ఆకాశ్‌రావు హత్యకు కారణమైన మావోయిస్టు పార్టీ కొంటా ఏరియా కమిటీ దళాన్ని తాజాగా భద్రతా బలగాలు తుడిచిపెట్టేసి ప్రతీకారం తీర్చుకున్నాయి. మరోవైపు బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా, మృతుల్లో పా ర్టీ అగ్రనేత హుంగా మడ్కం కూడా ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలోనే జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు గట్టి దెబ్బ.
సుక్మా జిల్లాలో మొదటి ఎన్‌కౌంటర్
సుక్మా జిల్లాలోని దక్షిణ బస్తర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యార న్న పక్కా సమాచారంతో ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కిష్టా రం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాములూరు సమీపంలో భద్రతా బలగాలను మోహరింపజేసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. లొంగి పోవాలని పోలీసులు హెచ్చరించినా మావోయిస్టులు లొంగిపోకుండా, కాల్పులు ప్రారం భించారు.
అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇరువర్గా ల మధ్య గంటల తరబడి కాల్పులు సాగాయి. భద్రతా దళాల తాకిడికి తాళలేని మావోయిస్టు లు దట్టమైన అటవీప్రాంతంలోకి పరారయ్యా రు. అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కొంటా ఏరియా కమిటీ డివిజనల్ సభ్యుడు సచిన్ మంగ్డూ ఉన్నాడు.
మంగ్డూ గతంలో ఎన్నో దాడులకు సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. ఎదురుకాల్పుల అనంతరం కూడా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు మరింత ము మ్మరం చేశామని ఎస్పీ వెల్లడించారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం డ్రోన్ల సాయం తో వేట కొనసాగిస్తున్నామని తెలిపారు.
బీజాపూర్ జిల్లాలో రెండో ఎన్‌కౌంటర్
బీజాపుర్ జిల్లాలోని దక్షిణ అటవీ ప్రాంతంలో కూడా మరో ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం తెల్లవారుజామున కూంబింగ్ ఆపరేషన్‌లో ఉన్న జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. జవాన్ల ను చూసిన మావోయిస్టులు వెంటనే కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ఇరువర్గాల మధ్య సుమారు అరగంట పాటు భీకరపోరు జరిగింది. అనంతరం మావోయిస్టులు అక్కడి నుంచి పరారవ గా, జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత హుంగా మడ్కం కూడా ఉన్నట్లు సమాచారం. జవాన్లు ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీ నం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని మావోయిస్టుల గుడారాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు.
ఘటనా స్థలంలో మూడు ఏకే-47 రైఫిళ్లు, ఇన్సాస్ తుపాకులు, ఎస్‌ఎల్‌ఆర్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. డిసెంబర్ చివరి నాటికి ఒక బస్తర్ డివిజన్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో 285 మంది మావోయిస్టులు మృతిచెందడం గమనార్హం.