calender_icon.png 5 January, 2026 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో డ్రైవర్ల అరెస్టు సరికాదు

04-01-2026 12:42:02 AM

  1. వారికిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీని శనివారం ముట్టడించిన ఆటో డ్రైవర్ల జేఏసీ నేతలను, వేలాది మంది ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ల నేతలను అసెంబ్లీ ముట్టడికి రాకుండా ఎక్కడిక్కడ అరెస్టు చేస్తోందని ఆయన ఆగ్ర హించారు. ఈ మేరకు కేటీఆర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వేలాది మంది ఆటో డ్రైవర్లను రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో అదుపులోకి తీసుకొని బంధించి ఉం చడం దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రశ్నిస్తే, నిర్బంధాలు, అరెస్టులతో గొంతు నొక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే భేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశా రు.

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలు పై స్పష్టమైన ప్రకటనను అసెంబ్లీలో ప్రభు త్వం చేయాలని ఆయన కోరారు. ఆటో డ్రైవ ర్ల ఆత్మహత్యలు కొనసాగకుండా ఉండాలం టే, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమ లు చేయాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు.