04-01-2026 12:45:16 AM
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : పేదలు, బడుగు వర్గాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొ న్నారు. అందులో భాగంగా 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ పథకాన్ని కొనసాగిస్తామని, కొత్తవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు.
కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, మార్పులు, చేర్పు లు చేయించాలనుకునేవారు ఎంపీడీవో కా ర్యాలయంలోని ప్రజాపాలన అధికారులకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డి, నాగరాజు తదితరుల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానమిచ్చారు. ప్రజాప్రభుత్వం ఇప్ప టివరకు గృహజ్యోతి లబ్ధిదారుల పక్షాన రూ.3,593 కోట్లు చెల్లించిందన్నారు.
అర్హులందరికీ పథకం వర్తింపు
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ పథకం కింద ఎస్పీడీసీఎల్ పరిధి లో 25,35,560 మంది ఎన్పీడీసీఎల్ పరిధిలో 27,938 మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 1.15 లక్షల కుటుంబాలు ఉండగా 52,82, 498 కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం ద్వారా పొందుతున్నారని డిప్యూటీ సీఎం వివరించారు.
ఈ పథకం ద్వారా ఆసిఫాబాద్ నియోజకవర్గం లో 45,995 కుటుంబాలు, అచ్చంపేట ని యోజకవర్గంలో 40,555 కుటుంబాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో 65,862, సిద్దిపేట నియోజకవర్గంలో 50,398 కుటుంబాలు గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ పథకం పార్టీలు, వర్గాలకు అతీతం గా రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.