calender_icon.png 5 January, 2026 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీలో మూడు కార్పొరేషన్లు?

04-01-2026 12:40:40 AM

  1. ఏర్పాటు దిశగా అడుగులు!
  2. కమిషనర్ జూమ్ మీటింగ్‌లో ఆసక్తికర చర్చ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 3 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిప ల్ కార్పొరేషన్ భవిష్యత్తు ముఖచిత్రం మారబోతోందా? నగర పాలక సంస్థను మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ దాదాపు ఖరారైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ  ప్రక్రియ మొత్తం మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ప్రాతిపదికనే సాగుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారు ల బదిలీలు, నియామకాలు, అదనపు బాధ్యతల కేటాయింపు అంతా ఈ మాస్టర్ ప్లాన్లో భాగమేనని విశ్వసనీయ సమాచారం.

పునర్వ్యవస్థీకరణపై శనివారం కమిషనర్ ఆర్‌వి కర్ణన్ అధికారులతో జూమ్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఐఏఎస్ అధికారి లేవనెత్తిన సందేహం, దానికి కమిషనర్ ఇచ్చిన సమాధానం మూడు కార్పొరే షన్ల ప్రతిపాదనకు బలం చేకూరుస్తున్నా యి. ‘మమ్మల్ని మూడు జోన్లకు అదనపు కమిషనర్గా నియమించారు సరే.. ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి? అని సదరు ఐఏఎస్ అధికారి ప్రశ్నించగా.. దీనికి కమిషనర్ బదులిస్తూ.. మానిటరింగ్ కోసం మీకు కేటాయిం చిన మూడు జోన్లకు సంబంధించి.. త్వరలోనే ఫైనాన్స్, అడ్మిన్ విభాగాల అధికారు లను కూడా నియమిస్తాం అని స్పష్టం చేసినట్లు సమాచారం.

అయితే గత నెల 25న మొదలైన 27 మున్సిపాలిటీల విలీనం, జోనల్ అధికారుల నియామకాల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ అత్యం త కీలకమైన అదనపు కమిషనర్ల బదిలీల దశకు చేరుకుంది. అదనపు కమిషనర్ల బదిలీల బాధ్యతను జోనల్ కమిషనర్లు అను రాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, అదనపు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిలకు అప్పగించినట్లు తెలిసింది. ప్రస్తుత జోనల్ కమిషనర్లను అదనపు కమిషనర్లుగా, అదనపు కమిషనర్లను జోనల్ కమిషనర్లుగా మార్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది.

శనివారం జరిగిన టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలను నిశితంగా గమనిస్తే.. నగరా న్ని మూడు ముక్కలు కార్పొరేషన్లు చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. మూడు గ్రూపులుగా జోన్లను విభజించి బాధ్యతలు అప్పగించారు.  శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, చార్మినార్, ఖైరతాబాద్, సికిందరాబాద్ జోన్ల టౌన్ ప్లానింగ్ బాధ్యతలను చీఫ్ సిటీ ప్లానర్  కె. శ్రీనివాస్కు అప్పగించారు. ఐటీ కారిడార్తో కూడిన శేరిలింగం పల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి జోన్ల బాధ్యతలను టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ బి. వెంకన్నకు కట్టబెట్టారు.

మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్ల బాధ్యతలను టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ బి. ప్రదీప్ కుమార్కు అప్పగించారు. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఆ తర్వాత మూడు కార్పొరేషన్లు ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే.. ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న ఆఫీసర్లే భవిష్యత్తులో ఆయా కార్పొరేషన్లకు చీఫ్ సిటీ ప్లానర్లుగా కొనసాగనున్నట్లు సమాచారం.