calender_icon.png 25 September, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదర్ మాట్ కు భారీ ప్రవాహం

25-09-2025 06:58:08 PM

నిండుకుండలా ఆనకట్ట 

ప్రవాహానికి ఊడిపోయిన గేట్లు

వృధాగా గోదావరిలో పోతున్న నీరు

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మేడిపల్లి గ్రామపంచాయతీలో సహజసిద్ధంగా గోదావరి నదిపై నిర్మించిన సదర్ మార్ట్ ఆనకట్ట వద్ద ప్రవాహం ఉదృతంగా కొనసాగుతుంది. దీంతో ఆనకట్ట వద్ద జల కళ సంతరించుకుంది. గత మూడు రోజులుగాపై ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పైన ఉన్న ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ధారాళంగా సదర్ మాటుకు ప్రవాహం పెరిగిపోయింది. ఆనకట్ట మీదుగా పొంగి పొర్లుతుండడంతో నీరు గోదావరిలోకి వృధాగా పోతుంది.

ప్రవాహ ఉధృతికి ఆనకట్ట వద్ద ఉన్న గేట్లు ఊడిపోవడంతో కాలువలోకి అధిక నీరు ప్రవహిస్తుంది. దీంతో కాలువ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి అప్రమత్తంగా ఉండాలని గురువారం అధికారులు సూచించారు. చూసేందుకు సందర్శకులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళవద్దని స్థానిక పోలీసులు హెచ్చరిస్తున్నారు.