04-08-2025 01:51:57 AM
హార్బర్ బ్రిడ్జిపై బ్యానర్లతో నిరసన వ్యక్తం చేసిన ప్రజలు
సిడ్నీ, ఆగస్టు 3: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం పాలస్తీనా వాసులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. సిడ్నీలోని ప్రము ఖ హార్బర్ బ్రిడ్జిపై జరిగిన ఈ ర్యాలీలో ఆస్ట్రేలియా సామాజిక కార్యకర్త, వికిలీక్స్ వ్యవ స్థాపకుడు జూలియన్ అసాంజే పాల్గొని.. పాలస్తీనా వాసులకు మద్దతు తెలిపారు. వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొని తమ నిరసన తెలిపారు. గాజా వాసులకు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శించారు.
గాజాపై దాడులు ఆపాలని, మానవతా సాయం అందేలా చూడాలన్నారు. ర్యాలీకి భారీ సం ఖ్యలో జనం తరలిరావడంతో సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ను నిలిపేశారు. సిడ్నీ లార్డ్ మేయర్ క్లవర్ మూర్, రిటైర్డ్ ఫుట్‌బాలర్ క్రి యాగ్ ఫాస్టర్ కూడా పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారు. ఇదే తరహాలో మెల్ బోర్న్ నగరంలో 25 వేల పైచిలుకు జనం ర్యాలీలో పాల్గొన్నారు.