04-08-2025 01:53:31 AM
ఇప్పటి వరకు ఆరుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్, ఆగస్టు 3: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు దక్షిణ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లా అఖల్ అడవుల్లో జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, భారత సైన్యం సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ అఖల్’ ఆ దివారం మూడో రోజుకు చేరుకుంది. శనివా రం భద్రతా దళాల చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా కాల్పుల్లో ఓ సైనికుడు గాయపడ్డాడు.
భద్రతాదళాలు ఆదివారం కూడా ఆపరేషన్‌ను కొనసాగించాయి. ఇప్ప టివరకు ఈ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరుకుంది. శుక్రవా రం ఈ ఆపరేషన్‌ను ప్రారంభించిన కొద్దిసే పటి తర్వాత నిలిపివేసి.. శనివారం ప్రారంభించింది. పహల్గాంలో అమాయకులను చంపిన ఉగ్రవాదులే టార్గెట్‌గా భద్రతాద ళాలు ఈ ఆపరేషన్‌ను మొదలుపెట్టాయి.