04-08-2025 01:46:47 AM
మాస్కో, ఆగస్టు 3: రోజుల వ్యవధిలో రష్యాలో మరో భూకంపం సంభవించింది. ఆదివారం రిక్టర్ స్కే ల్‌పై 7.0 తీవ్రతతో భూకంపం సం భవించినట్టు జపాన్ వాతావరణ శా ఖ, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సంస్థలు ప్రకటించాయి. రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
క్రాషెన్నినికోవ్ అగ్నిప ర్వతం శనివారం అర్ధరాత్రి బద్దలైం ది. అగ్నిపర్వతం బద్దలవడంతో దా దాపు 6వేల మీటర్ల ఎత్తుకు బూడిద (లావా) ఎగిసిపడినట్టు, దాదాపు 600 ఏండ్ల తర్వాత మొదటిసారి ఈ అగ్నిపర్వతం బద్దలైనట్టు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ పేర్కొంది.