17-10-2025 01:03:21 AM
హైదరాబాద్, అక్టోబర్ 16: ఆర్‌ఆర్ కేబు ల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ హాక్స్ మళ్ళీ పుంజుకుంది. సెమీస్ రేసులో నిలవాలంటే కీలకంగా మారిన మ్యాచ్‌లో గోవా గార్డియన్స్‌పై 3 సెట్ల తేడాతో విజ యం సాధించింది. గచ్చిబౌలీ స్టేడియం వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టీ మ్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. సూపర్ సర్వ్‌లు, కళ్ళు చెదిరే స్పైక్‌లతో అదరగొట్టిం ది. పలు అనవసర తప్పిదాలు గోవా కొంపముంచాయి. శిఖర్‌సింగ్, సాహిల్ కుమార్, యమమోటో అద్భుతంగా రాణించారు. దీంతో 15 20 15 15 స్కోర్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. హైదరాబాద్‌కు ఇది రెండో విజయం. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆరో స్థా నానికి చేరింది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక లో బెంగళూరు, ముంబై, అహ్మదాబా ద్ మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.