calender_icon.png 21 October, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలియమ్సన్‌కు లక్నో కీలక బాధ్యతలు

17-10-2025 01:04:25 AM

ముంబై, అక్టోబర్ 16: ఐపీఎల్ 2026 మినీవేలానికి ముం దు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాం చైజీ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా బాధ్యతలు అప్పగించింది. లక్నో ఓనర్ సంజీవ్ గో యెంకా సూచనతో ఆ టీమ్ మేనేజ్‌మెంట్ కేన్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్‌తో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ మొదటి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరగా.. గత రెండు ఎడిషన్లలో మాత్రం ఏడో ప్లేస్‌కు పరిమితమైంది. కేన్ మామ రాకతోనైనా లక్నో తలరాత మారుతుందేమో చూడాలి.