04-11-2025 05:06:47 PM
							పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్..
పాపన్నపేట (విజయక్రాంతి): మండలంలో రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ రైతులకు సూచించారు. మంగళవారం ఆయన ఎల్లాపూర్ వద్ద ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రాత్రివేళ ధాన్యం కుప్పలపై నల్లని టార్ఫాలిన్ కప్పి ఉంచడం వల్ల అవి వాహనదారులకు కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వేరే చోట ధాన్యం ఆరబోసుకోవాలని సూచించారు. ధాన్యం కుప్పల వద్ద ప్రమాదాలు జరిగితే చర్యలు తప్పవన్నారు. రైతులు సహకరించాలని సూచించారు. పోలీసు సిబ్బంది, తదితరులున్నారు.