04-11-2025 04:46:14 PM
							ప్రైవేట్ కళాశాలల నిరవధిక బందుకు పిడిఎస్యు మద్దతు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల నిరవధిక బంద్ కు పిడిఎస్యు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రూ.8800 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం కాలయాపన మానుకుని వెంటనే నిధులు విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి పెందూర్ నితిన్, నాయకులు జాడి వంశీ, షేక్ సమీర్, దుర్గం లక్ష్మణ్, జగజంపుల తరుణ్ తదితరులు పాల్గొన్నారు.