calender_icon.png 4 November, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడ్డి మందు తాగి..

04-11-2025 04:59:54 PM

మందమర్రి (విజయక్రాంతి)దాంపత్య జీవితంలో మనస్పర్థలు రావడంతో కట్టుకున్న భార్యతో తెగతెంపులు చేసుకుని జీవితంపై విరక్తి చెంది సింగరేణి కార్మికుడు మెంగని శ్రీకాంత్(31) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మున్సిపల్ పరిధిలోని రామకృష్ణాపూర్(వి)లో మంగళవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతునికి 11 సంవత్సరాల క్రితం వివాహం కాగా గత 4 సంవత్సరాలుగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకొని నెల రోజుల క్రితం ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకున్నారని అప్పటినుండి మృతుడు మానసికంగా కృంగి పోయి ఈ నెల 1న రాత్రి ఇంట్లో వ్యవసాయ పనుల కోసం తీసుకొచ్చిన గడ్డి మందు సేవించగా గమనించిన బంధువులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 3న మృతిచెందాడు. ఈ మేరకు మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.