calender_icon.png 4 November, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల మహానాడు చలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ

04-11-2025 04:52:22 PM

హనుమకొండ (విజయక్రాంతి): రాజ్యాంగ హక్కుల సాధన సభ ఆధ్వర్యంలో నవంబర్ 26న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించే కరపత్రాన్ని హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పనికిల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగ ఆమోదించిన దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న రాజ్యాంగ హక్కుల సాధనకు మాల మహానాడు ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని, కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ బొమ్మ ముద్రించాలని, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహకారం అందించాలని, ఎస్సీ రిజర్వేషన్లు 15 నుంచి 20% కు పెంచాలని, ఎస్సీ వర్గీకరణ జీవోను పునర్ సమీక్షించాలని, మొదలైన డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి వెన్న రాజు, హనుమకొండ జిల్లా కార్యదర్శి పడుగుల నరసయ్య, ఉపాధ్యక్షులు మల్లం రాజకుమార్, గొర్రె రమేష్, గరిగే అనిల్, ఉరిసిల్ల ఉదయ్, కూనమల్ల అనిత, సంపత్, రఘు, శ్రీను, నరేష్, శ్రావణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.