04-11-2025 04:50:16 PM
							టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో సమీప జామాయిల్ తోటలో మేత మేస్తున్న రెండు పశువులపై పిడుగు పడి రెండు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయని గ్రామస్తులు తెలిపారు. బోడు గ్రామానికి చెందిన కేగర్ల నర్సయ్య, మాడే సంజీవకు చెందిన పశువులుగా గుర్తించారు.