23-08-2025 01:18:13 AM
ఫోన్ ఇన్ కార్యక్రమంలో టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): సీపీఎస్, యూపీఎస్ వద్దని.. ఓపీఎస్ (పాతపెన్షన్) ముద్దు అని, ఓపీఎస్‌ను సాధించేందుకు జరిగే పోరాటంలో ప్రతీ ఉపాధ్యాయుడు పాల్గొనాలని టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీన పీఆర్‌టీయూ టీఎస్ నేతృత్వంలో పెన్షన్ విద్రోహ దినం మహాధర్నాను వేలాది మంది ఉపాధ్యాయులతో చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇందులో భాగంగానే ఆయన శుక్రవారం పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ రెడ్డితో కలిసి ‘ఫోన్ ఇన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాల్లోని టీచర్లకు ఫోన్ చేసి మహాధర్నా ఆవశ్యకతను వివరించారు.
ప్రతీ ఉపాధ్యాయుడిని ఓపీఎస్ కోసం చేపట్టే ఆందోళన వైపు నడిపించాలని సూచించారు. సీపీఎస్ రద్దు కోసం అనేక సంవ త్సరాలుగా పోరాటం చేస్తున్నామని, ఈసారి తమ గళాన్ని గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఉపాధ్యాయు లకు గుర్తు చేశారు.