calender_icon.png 30 May, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

28-05-2025 04:28:47 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): వరద కాలువల(Flood Canals) దగ్గర ఉన్న వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) పర్యటించారు. మంగళవారం కురిసిన వర్షానికి నీట మునిగిన రామచంద్రపురం ప్రాంతాలను క్షేత్ర స్థాయి పరిశీలించారు. పూడుకుపోయిన కాలువలను తెరిపించడంతో పాటు బైపాస్ గా వరదకాలువ తవ్వకాలను హైడ్రా కమిషనర్(Hydra Commissioner) సందర్శించి వర్షాకాలం మళ్ళీ యిక్కడ రోడ్డు మీద నీరు నిలబడకుండా కాలువల ద్వారా వెళ్లేలా కాలువను విస్తరించాలన్న జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.

రామచంద్రాపురంలో నీరు నిలబడడానికి కారణాలను జీహెచ్ఎంసీ(GHMC), నేషనల్ హైవే అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత చందానగర్, లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య సురభి కాలనీ ప్రారంభంలో ఉన్న ఆర్యూబీ వద్ద నీరు నిలిచే ప్రాంతాలను హైడ్రా కమిషనర్(Hydra Commissioner) పరిశీలించారు. గోపి చెరువు, చాకలి చెరువుల నుంచి వచ్చే వరదతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరదలతో యిబ్బంది ఏర్పడుతోందని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. బాక్స్ డ్రెయిన్ (Box Drain) విస్తరించడంతో ఈ ఏడాది కొంత సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. డ్రైన్లలో చెత్త పేరుకుపోకుండా చూడాలని అధికారులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ ఆదేశించారు.