28-05-2025 04:54:54 PM
ఆత్మకూర్ కు అంతర్జాతీయ గుర్తింపు..
సార్.. ఐయాం రఘునందన్ మాచన ఫ్రమ్ ఆత్మకూర్.. తెలంగాణ అంటూ స్విట్జర్లాండ్ జెనీవాలో జరిగిన ప్రపంచ దేశాల పొగాకు నియంత్రణ సదస్సు(Tobacco Control Conference) పాలమూరు బిడ్డ.. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడారు. వివరాల్లోకి వెళ్తే.. పొగాకు నియంత్రణకు 22 ఏళ్ళుగా అసాధారణ కృషి చేస్తున్న మాచన రఘునందన్.. జెనీవాలో జరిగిన ప్రపంచ పొగాకు వ్యతిరేక సదస్సు(World No Tobacco Day)కు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి ఈ సదస్సులో ప్రాతినిధ్యం వహించింది "మాచన" ఒక్కరే. పొగాకు నియంత్రణ ఆవశ్యకతను కూలంకషంగా.. వివరిస్తూ.. ధూమపానం ఎంతో మంది జీవితాల్ని చిద్రం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో మంది యువత తెలిసో తెలియకో స్మోకింగ్ కు అలవాటు అవుతున్నారని రఘునందన్ వివరించారు. యువత తమ జీవితాన్ని పొగాకు ఉత్పత్తుల అలవాటుతో అంధకారం చేసుకుంటున్నారని చెప్పారు. తన ఇరువురు ఆప్త మిత్రులను పొగాకుకు బలి అయ్యారు అనే కసితో, ఓ సాదా సీదా ఉద్యోగిని.. కెన్నాట్ వి స్టాప్ ఇట్(మనం దీన్ని ఆపలేమా?!) అని ప్రపంచ పొగాకు వ్యతిరేక సదస్సులో ప్రశ్నించారు. ఆత్మకూర్ గళం ప్రపంచ వేదికకు వినిపించిన ఘనత దక్కించుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిన జెనీవా సదస్సుకు వివిధ దేశాల నుంచి పొగాకు నియంత్రణ నిపుణులను ఆన్లైన్ ద్వారా సమావేశంలో పాల్గొనే అవకాశం కలిగించారు. అమావాస్య నాడు ఆత్మకూర్ వచ్చిన సందర్భంగా మాచన రఘునందన్ టొబాకో కాన్ఫరెన్స్ లో ఆత్మకూర్ వేదికగా.. తన గళం వినిపించారు.
ఎట్ లీస్ట్, లెట్ అస్ కంట్రోల్ ఇట్ (ఇక నైనా నియంత్రించే ప్రయత్నం చేద్దాం సార్) అని ప్రార్థించారు. ఓ వ్యక్తి సమాజ హిత కాంక్ష, తపన.. ప్రపంచ పొగాకు వ్యతిరేక వేదిక ను సైతం వావ్.. మాచన రఘునందన్.. వాట్ ఏ అమేజింగ్ ఇండియన్ అని కొనియాడేలా చేసింది. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్విట్జర్లాండ్ జెనీవాలో మే 29న వరల్డ్ నో టుబాకో కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళతో రెండు రోజులుగా సమావేశం నిర్వహించారు. మే 29న జరిగే ప్రపంచ పొగాకు వ్యతిరేక సదస్సులో ఏయే అంశాలు చర్చించాలి అనే అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ఈ క్రమంలోనే మాచన రఘునందన్ తెలంగాణలో 5 ఏళ్ల లో 5000 కిలో మీటర్లు ప్రయాణించి.. 500 గ్రామాల్లో దాదాపు 50,000 మందిని పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్ధాలను వివరించడంలో చేసిన అసాధారణ కృషిని పొగాకు నియంత్రణ సంస్థలు, నిపుణులు శ్లాఘించారు. ఈ మేరకు రఘునందన్ బుధవారం నాడు మాట్లాడుతూ.. మే 29న జరిగే సదస్సులో సైతం ఆన్లైన్ లో పాల్గొననున్నట్టు చెప్పారు.