calender_icon.png 25 August, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తిలో సైబర్ మోసం

25-08-2025 12:29:00 AM

  1. అనుమతి లేకుండా ఓ వ్యక్తి వివరాలు చోరీ?
  2. వ్యాపారం పేరుతో బ్యాంకు నుంచి పది కోట్ల రుణం!
  3. అధికారుల తనిఖీల్లో బయటపడ్డ భాగోతం  

కల్వకుర్తి, ఆగస్టు 24: వ్యాపార సముదాయాన్ని తనిఖీ చేసేందుకు సంబంధిత చిరు నామాకు అధికారులు వెళ్లగా.. అక్కడ ఎలాం టి వ్యాపార సంస్థ లేకపోవడంతో భారీ మో సం బయటపడింది. కల్వకుర్తి పట్టణానికి చెందిన సలీం అనే వ్యక్తి పట్టణంలోని ప్రైవే ట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాడు. త న పేరుతో సైబర్ నేరగాళ్లు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుని రూ.100 కోట్ల విలువైన నకిలీ ఇన్ వాయిస్ జారీ చేసినట్లు వెలుగులోకి వచ్చిం ది.

సలీం అనుమతి లేకుండానే ఆధార్, పా న్, బ్యాంక్ వివరాలను వాడి సలీం ఎంటర్‌ప్రైజెస్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధి కారులు గుర్తించారు.  నకిలీ పత్రాలు విద్యు త్ బిల్లు, తల్లి పేరుతో చూపిన ఎన్‌ఓసీ సమర్పించారు. రిజిస్ట్రేషన్  పునరుద్ధరణలో భా గంగా జీఎస్టీ అధికారులు వ్యాపార స్థలాన్ని తనిఖీ చేయగా అది కేవలం నివాస గృహమని తేలింది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని బాధితుడు కోరాడు.