25-08-2025 12:29:05 AM
బంజారాల సంప్రదాయానికి ప్రత్యేక తీజ్
బంచరాయితండలో గంగమ్మ ఒడికి చేరుకున్న తీజ్
మారిపెడ ఆగస్టు 24 (విజయ క్రాంతి) ః మహబూబాబాద్ జిల్లా బంజారాల సంప్రదాయక ప్రతికైనా తీజ్ పండుగను బంచరాయితండాలో ఆదివారం తండా వాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కురవి మండల కేంద్రంలోని బంచరాయితండ లో తీజ్ ను గంగమ్మ ఒడిలోకి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు బానోత్ దేవేందర్ నాయక్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బానోత్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ పండుగ తొమ్మిది రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం తొమ్మిదో రోజు నిమజ్జనం చేశారు. ఈ తీజ్ పండుగను పెళ్లి కానీ గిరిజన యువతులు ఘనంగా నిర్వహిస్తారని బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక పండుగ తీజ్ అని అన్నారు.